ఇంతకు ముందు కంటే ఇప్పుడు Covid 19(Corona Virus) రోజు రోజుకు ప్రమాద స్థాయి పెరుగుతుంది అని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. కరోనా (Carona Virus) వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు దేశ ప్రజలు అందరూ తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అని ప్రకటించారు.
" మన్ కీ బాత్(Mann Ki Baat) " కార్యక్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మిగతా విదేశాలతో పోలిస్తే కోవిడ్ (Covid 19) మరణాలు రేటు తక్కువగా ఉన్న, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కరోనా(Corona Virus) వ్యాప్తి పెరుగుతూ ఉంది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ తొలగించే ముందు , సామజిక దూరం పాటించకుండా ఉండే వాళ్ళు మార్చి నెల నుంచి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఘోరంగా శ్రమిస్తున్న కోవిడ్ (Covid) యోధులను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి అంటూ అయన విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment